పుడితే మంత్రం
చస్తే మంత్రం
గర్భానికి మంత్రం
బారసాలకి మంత్రం
ఉపనయనానికి మంత్రం
అక్షరాభ్యాసానికి మంత్రం
రజస్వలోత్సవానికి మంత్రం
వివాహానికి మంత్రం
మంత్రం మంత్రం మంత్రం అంటూ
అన్నింటా మంత్రాలూ సృష్టించి
సామాన్య ప్రజలను పీక్కుతిని
కుక్షి నింపుకొనే
పండిత పక్షిరాజములను
పాణిగ్రహణమొనరింపక పరిహసించెడు
పడతులందఱకు వందనం !
ఉన్నాడో లేడో తెలియని
దేవుని సృష్టించి
నారాయణునికి నరునికి నడుమ
రాయబారుల్లా పూజారులు
లంచమిస్తే తప్ప అనుగ్రహించని
కరకంచదారులు
భగవంతుని పేర కుంచం గడిపే
పండిత వరేణ్యుల
పరిణయమాడక పరిహసించెడు
బ్రాహ్మణాంగనలకు వందనం !!
స్వర్గ నరకాలను సృష్టించి
గతించిన వారికి గతులు గల్గవలెనని
ఉప్పూ పప్పూ బియ్యం చింతపండుతో పాటు
గోదాన భూదాన సమస్త దానాల్ని స్వీకరించి
చచ్చిన వారికి స్వర్గాన్నందించే మిషతో
చెమటోడ్చి సంపాదించిన
కష్టార్జితాన్ని కాజేసే
నాకాలోకపు ద్వారపాలకులను
వివాహమాడక విసర్జిస్తున్న
వనితా లలామలందఱకు వందనం !!!
No comments:
Post a Comment